మైదానంలో రోహిత్, కోహ్లీ దూకుడు.. ఒంటిచేతి విరాట్ సూపర్ క్యాచ్‌.. హిట్మ్యాన్ మ్యాజిక్ త్రో! 

మైదానంలో రోహిత్, కోహ్లీ దూకుడు.. ఒంటిచేతి విరాట్ సూపర్ క్యాచ్‌.. హిట్మ్యాన్ మ్యాజిక్ త్రో! 

Rohit Sharma, Virat Kohli: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలతో విరుచుకుపడ్డారు. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ కివీస్ బ్యాటర్లను మైండ్ బ్లాక్ చేశారు. హిట్ మ్యాన్ మెరుపు వేగంతో రనౌట్ చేయగా, కింగ్ కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రోహిత్ శర్మ రనౌట్.. మిచెల్‌కు మైండ్ బ్లాక్: 

అక్షర్ పటేల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం పిలిచాడు. కానీ అక్కడ ఉన్నది రోహిత్ శర్మ.. చిరుతపులిలా ముందుకు దూసుకొచ్చి, క్షణాల్లో బంతిని అందుకుని కేఎల్ రాహుల్‌కు బుల్లెట్ వేగంతో విసిరి సరిగ్గా వికెట్లను గిరాటేయించాడు. భారత్‌కు ఎప్పుడూ ప్రమాదకరంగా మారే కివీస్ ప్రధాన బ్యాటర్ డారిల్ మిచెల్ క్రీజు బయటే ఉండిపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ చేసిన ఈ కిరాక్ ఫీల్డింగ్‌తో టీమిండియా కీలకమైన బ్రేక్‌త్రూ సాధించింది.

గాల్లోకి ఎగిరి సూపర్‌మ్యాన్ క్యాచ్ పట్టిన కోహ్లీ: 

యువ పేసర్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ నాథన్ స్మిత్ ఆఫ్ స్టంప్ అవతలి బంతిని భారీ షాట్ ఆడబోయాడు. బంతి ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కుడివైపునకు గాల్లోకి ఎగిరి ఒంటిచేతితో క్యాచ్‌ని సాధించాడు. గ్రౌండ్‌లో విరాట్ చేసిన ఈ ఊహించని ఫీల్డింగ్ విన్యాసానికి కివీస్ ప్లేయర్లు నోరెళ్లబెట్టారు. థర్డ్ అంపైర్ కూడా రిప్లేలో క్లీన్ క్యాచ్ అని నిర్ధారించడంతో న్యూజిలాండ్ తీవ్ర కష్టాల్లో పడింది.