పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబైతో భారీ ట్రేడ్ డీల్?

పంజాబ్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబైతో భారీ ట్రేడ్ డీల్?

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌ ట్రేడింగ్ విండోలో భాగంగా ముంబై ఇండియన్స్‌‌‌‌, పంజాబ్‌‌‌‌కింగ్స్‌‌‌‌ తమ ఆటగాళ్ల మార్పిడిపై చర్చలు జరుపుతున్నాయి. స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యాను తమ జట్టులోకి తీసుకుని, బదులుగా పేస్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ను ముంబైకి పంపేలా పంజాబ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముమ్మర చర్చలు జరుపుతోంది. 2024 సీజన్‌‌‌‌లో ముంబై కెప్టెన్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 

గత మూడు సీజన్లలో రెండుసార్లు ప్లే-ఆఫ్ చేరడంలో విఫలమైంది. మరోవైపు రోహిత్ శర్మ తిరిగి ముంబై కెప్టెన్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌‌‌‌గా కొనసాగనుండటంతో, హార్దిక్ కేవలం ఆటగాడిగా మాత్రమే ఆ జట్టులోకి రానున్నాడు. నవంబర్ 17 నాటికి రిటెన్షన్ ప్రక్రియ పూర్తికానుండటంతో డిసెంబర్ 16న గోవాలో జరిగే మినీ-వేలానికి ముందే ఈ ట్రేడ్‌‌‌‌పై స్పష్టత రానుంది.