కేంద్ర నిధులను పైసా వదలకుండా రాబట్టాలి..సెంట్రల్ స్కీమ్స్ నిధులపై భట్టి హైలెవల్ రివ్యూ

కేంద్ర నిధులను పైసా వదలకుండా రాబట్టాలి..సెంట్రల్ స్కీమ్స్ నిధులపై భట్టి హైలెవల్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాయోజిత కార్యక్రమాల (సీఎస్ఎస్) కింద కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో రాబట్టడంతో పాటు వాటిని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి ఉన్నతాధికారులతో కేంద్ర పథకాల నిధులు, ఖర్చులు, పెండింగ్ బిల్లులపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు.

కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి నిబంధనలకు అనుగుణంగా సకాలంలో ప్రతిపాదనలు పంపాలని, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లైజన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర మంత్రులకు సీఎం, తాను రాసిన లేఖలపై నిరంతరం ఫాలోఅప్ చేయాలని స్పష్టం చేశారు.