దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గర కో రైటర్‌గా వర్క్ చేసిన ఎస్ కృష్ణ డైరెక్టర్‌గా పరిచయం అవుతోన్న చిత్రం ‘హై’. ఈ సినిమాతో నటుడిగా కూడా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగే హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘దమ్ములుంటే’ అంటూ ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఈ పాటలో సినిమాలోని మెయిన్ లీడ్ అంతా సందడి చేశారు. రోల్ రైడా ఎనర్జిటిక్ ర్యాప్, వికాస్ బడిసా అందించిన జోష్‌ఫుల్ మ్యూజిక్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్నేహం, సరదా, యూత్‌ఫుల్ సెలబ్రేషన్స్‌తో సాంగ్ ఆకట్టుకుంటోంది. ఆనందం, సంతోషం కోసం విభిన్నమైన కోరికలతో ప్రయాణించే వ్యక్తుల కథగా ‘హై’ తెరకెక్కుతోంది.
