ఆలోచింపజేసే మెసేజ్ తో సీన్ మూవీ..

ఆలోచింపజేసే మెసేజ్ తో సీన్ మూవీ..

కోలీవుడ్  స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం  ‘సీన్’.  ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించగా, సూర్య, జ్యోతిక నిర్మించారు. దీపావళి కానుకగా  నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో  సినిమా  విడుదల కానుంది. ఎన్వీఆర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌‌‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ఈ ఏడాది  సూర్య గారు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నారు అని చెప్పాడు. 

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ‘వీర భద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత  ఈ ఏడాదిలో ప్రేక్షకుల్ని కలవడం ఇది మూడోసారి. దీన్ని ఒక బ్లెస్సింగ్‌‌‌‌గా భావిస్తున్నా. ‘సీన్’ ఒక బ్యూటిఫుల్ సినిమా. ఇందులో మర్డర్ మిస్టరీ, మ్యాడ్‌‌‌‌నెస్, నవ్వులు లాంటివన్నీ ఉన్నాయి.  చాలా ఫ్రెష్ టాలెంట్ కూడా ఉంది.  ‘మనపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు’ అని ఈ చిత్రంలో ఉన్న  డైలాగ్ అందర్నీ ఆలోచింపజేస్తుంది’ అని చెప్పాడు. 

ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా యూనిక్‌‌‌‌గా ఉంటుందని నజ్రియా నజీమ్ చెప్పింది. సూర్య గారి కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది చాలా కొత్త సినిమా అవుతుందని, అందర్నీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా ఉంటుందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. ప్రొడ్యూసర్ జయశ్రీ దామోదరన్,  లిరిక్ రైటర్ రాకేందు మౌళితోపాటు టీమ్ అంతా పాల్గొన్నారు.