మల్కాజిగిరి, వెలుగు: బాలికలు, యువతులను శారీరకంగా, మానసికంగా బలోపేతం చేసే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ మహిళా భద్రతా విభాగం నిర్వహిస్తున్న ధీర కార్యక్రమం నాలుగో విడత మంగళవారం చైతన్యపురిలో జరిగింది.
ఇందులో టీజీఎస్డబ్ల్యూఆర్ మహిళా డిగ్రీ కాలేజీ, మహిళా న్యాయ కళాశాలలకు చెందిన 700 మందికి పైగా విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్ లో మెలకువలను నేర్పారు. ఇందులో ఎల్‌బీ నగర్ జోన్ డీసీపీ అనురాధ, మహిళా భద్రత విభాగం డీసీపీ ఉషారాణి పాల్గొన్నారు.
