ఢిల్లీ లోకి నాన్ బీఎస్ 6 వాహనాలకు నో ఎంట్రీ

ఢిల్లీ లోకి నాన్ బీఎస్ 6 వాహనాలకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 1 నుంచి నాన్​బీఎస్​6 వాహనాలను లోపలికి అనుమతించడం లేదు. రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రాజధాని సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు చేస్తూ.. బీఎన్ఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా లేని వెహికల్స్​ను వెనక్కి పంపుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్​అవుతోంది. 

ముఖ్యంగా ఢిల్లీ-–గురుగ్రామ్, ఢిల్లీ –నోయిడా సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్-48 మార్గంలోని సిర్హోల్ టోల్ ప్లాజా వద్ద పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ప్రధాన రహదారితోపాటు సర్వీస్ రోడ్లపైనా గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుండటంతో విధులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర పనుల కోసం వెళ్లే సాధారణ ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. ఈ ఆంక్షలు వచ్చే జనవరి 31 వరకు అమల్లో ఉంటాయి. సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంది.

మరిన్ని వార్తలు