తెలంగాణ వ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ..

తెలంగాణ వ్యాప్తంగా  24 మంది జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ..
  • ఈనెల 12 లోగా విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 24 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉట్నూర్‌‌‌‌లో పనిచేస్తున్న మౌనిక పొన్నపల్లిని ఆదిలాబాద్‌‌‌‌కు, ఖమ్మంలో పనిచేస్తున్న బిందు ప్రియను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు, వనపర్తిలో పనిచేస్తున్న బండారి శ్రీలతను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌‌‌‌కు, భద్రాచలంలో పనిచేస్తున్న శివనాయక్‌‌‌‌ను నల్గొండకు బదిలీ చేసింది. నారాయణపేటలో పనిచేస్తున్న కె.అవినాష్‌‌‌‌ను మక్తల్‌‌‌‌కు, కొల్లాపూర్‌‌‌‌లో పనిచేస్తున్న శరణ్యను కల్వకుర్తికి, దేవరకొండలో పనిచేస్తున్న హరీశ్‌‌‌‌బాబును నకిరేకల్‌‌‌‌కు, బోధన్‌‌‌‌లో పనిచేస్తున్న సాయి శివను యాదాద్రి భువనగిరి జిల్లాకు ట్రాన్స్ ఫర్ చేసింది. 

సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మెడ్చల్‌‌‌‌-మల్కాజిగిరి జిల్లాల్లోనూ పలువురు న్యాయాధికారులకు స్థానచలనం కల్పించింది. మరికొన్ని కోర్టుల్లో అదనపు బాధ్యతలను ఇతర న్యాయాధికారులకు అప్పగించింది. బదిలీ ఉత్తర్వులు అందుకున్న వారంతా ఈ నెల 12వ తేదీలోగా కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత స్థానాల్లో రిజర్వు చేసిన తీర్పులు, ఉత్తర్వులను ప్రకటించిన తర్వాతే రిలీవ్ కావాలని, విధుల నుంచి రిలీవ్ అయిన తేదీ, కొత్త స్థానంలో చేరిన తేదీని ఏడు రోజుల్లోగా తమకు తెలియజేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.