వాట్సాప్ చూడొద్దన్నందుకు రెండో అంతస్తు నుంచి దూకి బాలిక ప్రాణాలు తీసుకుంది..చర్లపల్లి మింట్ కాలనీలో ఘటన

వాట్సాప్ చూడొద్దన్నందుకు రెండో అంతస్తు నుంచి దూకి బాలిక ప్రాణాలు తీసుకుంది..చర్లపల్లి మింట్ కాలనీలో ఘటన

మల్కాజిగిరి, వెలుగు: చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మింట్ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. తరచూ వాట్సాప్ చూస్తుండడంతో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 17 ఏండ్ల బాలిక రెండో అంతస్తు పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. 15 ఏండ్ల క్రితం ఆంధ్రా నుంచి వచ్చిన ఓ కుటుంబం మింట్ కాలనీలో నివాసం ఉంటోంది. సోమవారం రాత్రి బాలిక వాట్సాప్ చూస్తుండటంతో తల్లిదండ్రులు ‘ఎప్పుడూ అదే పనా’ అని మందలించారు. 

దీంతో మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం తెల్లవారుజామున భవనంలోని రెండో అంతస్తు నుంచి దూకింది. దీంతో తీవ్ర గాయాలై బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో సూసైడ్ నోట్‌‌‌‌ దొరకడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చర్లపల్లి సీఐ సుధాకర్ తెలిపారు.