పునరావాసానికి భారీ నిధులు ..మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తాం

పునరావాసానికి భారీ నిధులు  ..మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తాం
  •  మక్తల్ నియోజకవర్గంలో రూ.2,200 కోట్ల అభివృద్ధి పనులే లక్ష్యం
  •     మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు:  భూ నిర్వాసితుల పునరావాసానికి భారీ నిధులు కేటాయించామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడమే తన సంకల్పమని, మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. 

మంగళవారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 39 గ్రామాల సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రస్తుతం రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 

రూ.500 కోట్లతో బీటీ రోడ్లు, రూ.237 కోట్లతో మక్తల్–నారాయణపేట నాలుగు లేన్ల రహదారి, రూ.80 కోట్లతో అత్యాధునిక ఆస్పత్రి, రూ.26 కోట్లతో స్టేడియం నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. భూత్పూర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో భూములు కోల్పోయిన గ్రామాలకు బదులుగా ఆధునిక హంగులతో నూతన పునరావాస గ్రామాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

 అనుగొండకు రూ 50 కోట్లు, అంకెన్‌‌‌‌‌‌‌‌పల్లికి రూ28 కోట్లు, దాదన్‌‌‌‌‌‌‌‌పల్లికి రూ30 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించిందని వివరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత నాయకులపై ఉందని సూచించారు.