సీఎస్కే బిగ్ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడిపై కన్ను!

సీఎస్కే బిగ్ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడిపై కన్ను!

CSK, SRH Trade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వార్ (Trading War) తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకవైపు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ సంచలనం సృష్టిస్తుండగా.. మరొకవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone)ను దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.

లివింగ్‌స్టోన్‌పై సీఎస్‌కే కన్ను: 

ఐపీఎల్ 2026 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించి ఇంగ్లాండ్ స్టార్ ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను దక్కించుకుంది. అయితే ఆ సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 15 పరుగులు చేసి విఫలం కావడంతో అతనికి ప్లేయింగ్ XIలో చోటు దక్కలేదు. క్రిక్‌బజ్ (Cricbuzz) కథనం ప్రకారం.. లివింగ్‌స్టోన్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై (CSK) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉత్తరాదికి చెందిన మరొక ఫ్రాంచైజీ కూడా అతనిపై ఆసక్తి చూపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై సన్‌రైజర్స్ యాజమాన్యం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. 

(గతంలో 2019లో రాజస్థాన్ రాయల్స్ ద్వారా రూ. 50 లక్షలకు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లివింగ్‌స్టోన్‌ను.. 2022లో పంజాబ్ కింగ్స్ రూ. 11.5 కోట్లకు, 2025లో ఆర్‌సీబీ రూ. 8.75 కోట్లకు దక్కించుకున్నాయి).

హార్దిక్ పాండ్యా డీల్‌లో బిగ్ ట్విస్ట్: 

ఐఏఎన్‌ఎస్ (IANS) నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ ద్వారా దక్కించుకోవడంలో పంజాబ్ కింగ్స్ (PBKS) అందరికంటే ముందు వరుసలో ఉంది.

అర్ష్‌దీప్ సింగ్ ముంబైకి.. హార్దిక్ పంజాబ్‌కు?:

* ఈ ట్రేడ్ డీల్ ప్రకారం హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌లోకి వెళితే.. పంజాబ్ నుంచి భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లే అవకాశం ఉంది.

* రెండు ఫ్రాంచైజీల టాప్ మేనేజ్‌మెంట్ మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక పేపర్ వర్క్ పూర్తి చేసి ఐపీఎల్ అధికారుల ఆమోదం తీసుకోనున్నారని తెలుస్తోంది.

మిగతా ఫ్రాంచైజీల ప్రయత్నాలు విఫలం: 

* కేకేఆర్ (KKR): అజింక్యా రహానే రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్ కోసం హార్దిక్ కోసం చర్చలు జరిపినప్పటికీ, తమ కోర్ (Core) ప్లేయర్లను వదులుకోవడానికి నిరాకరించడంతో డీల్ క్యాన్సిల్ అయింది. 

* రాజస్థాన్ రాయల్స్ (RR): యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌లను ఆఫర్ చేసినా చర్చలు ముందుకు కొనసాగలేదు.

* లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్: ప్రారంభంలో ఆసక్తి చూపినప్పటికీ రేసులో వెనుకబడిపోయాయి.