నాకు నచ్చిన కెప్టెన్లు వాళ్లిద్దరే.. టీమిండియా సారథ్యంపై సచిన్ సంచలన వ్యాఖ్యలు!

నాకు నచ్చిన కెప్టెన్లు వాళ్లిద్దరే.. టీమిండియా సారథ్యంపై సచిన్ సంచలన వ్యాఖ్యలు!

Sachin Tendulkar: క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్ (God of Cricket) గా పిలవబడే భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా నిర్వహించిన ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌లో అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో అత్యుత్తమ కెప్టెన్లు, టీమిండియా సారథ్య అనుభవాలు, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) నాయకత్వంపై సచిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

సొంతంగా జట్టును సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు: 

1996 నుంచి 2000 మధ్య రెండు విడతలుగా 25 టెస్ట్ మ్యాచ్‌లకు సచిన్ భారత్ జట్టుకు సచిన్ ప్రాతినిధ్యం వహించారు. అయితే తన కెప్టెన్సీ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. అప్పట్లో బీసీసీఐ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం, కానీ ఆ రోజుల్లో నా మనసుకు నచ్చిన విధంగా జట్టును పూర్తిగా నేనే ఎంచుకునే స్వేచ్ఛ నాకు ఉండేది కాదు.. 1990ల కాలంలో ఉన్న నాటి బీసీసీఐ కంటే.. ఇప్పటి బీసీసీఐ చాలా ప్రొఫెషనల్‌గా పని చేస్తోంది. అంతేకాకుండా ఆ సమయంలో భారత క్రికెట్ ఒక రకమైన చీకటి కాలాన్ని కూడా ఎదుర్కొందని లిటిల్ మాస్టర్ అన్నారు.

నాకు నచ్చిన కెప్టెన్లు గంగూలీ, ధోనినే: 

తన కెరీర్‌లో కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఎందరో గొప్ప కెప్టెన్ల హయాంలో ఆడిన నేను.. కానీ నాకు వ్యక్తిగతంగా ఎవరి నాయకత్వం బాగా నచ్చిందో సచిన్ చెప్పారు. అయితే నా విషయానికొస్తే.. నేను ఆడిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని (MS Dhoni) లు మాత్రమే నా ఆల్‌టైమ్ ఫేవరెట్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటారని టెండూల్కర్ పేర్కొన్నారు. ఇక గంగూలీ నాయకత్వంలో సచిన్ 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరుకోగా, ధోని సారథ్యంలోనే 2011లో ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడారు.

టెంబా బవుమా కెప్టెన్సీపై ప్రశంసలు:

ప్రస్తుత దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా గురించి ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ.. టెంబా బవుమా ఆడే తీరు, అతని స్పిరిట్ నాకు చాలా ఇష్టం.. అతడు ముందుండి నడిపిస్తూ సౌతాఫ్రికా క్రికెట్‌కు అద్భుతమైన ఫలితాలను అందించాడు. దక్షిణాఫ్రికా లాంటి జట్టు ఐసీసీ టైటిల్ సాధించడం ప్రపంచ క్రికెట్‌కే ఎంతో శుభపరిణామం అన్నాడు.