IND vs NZ 1st ODI: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా వర్షం అంతరాయం తర్వాత ప్రారంభమైన తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఛేజింగ్ చేయడం కలసివస్తుందనే ఆలోచనతో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ఇరు జట్లు పలు మార్పులు చేశాయి.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. వాతావరణం మబ్బుగా (Overcast) ఉంది, ఒకవేళ ఓవర్లు కుదించినా సరే మన ముందు ఒక టార్గెట్ ఉండటం ఎప్పుడూ మంచిదే.. సిరీస్ కోసం జట్టులోని ఆటగాళ్లంతా చాలా ఉత్సాహంగా, పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. న్యూజిలాండ్‌లో ఉండే ఈ కండిషన్స్ రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మ్యాచ్‌లో అన్షుల్ కంబోజ్, ఆకిబ్ ఖాన్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్లు మా పేస్ బౌలింగ్ విభాగంలో బరిలోకి దిగుతున్నారని గిల్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. డెవాన్ కాన్వే మంచిగానే ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చాం, దీంతో అతను ఇవాళ్టి మ్యాచ్ ఆడటం లేదు.. కాన్వే స్థానంలో టిమ్ సైఫర్ట్‌కు అవకాశం దక్కింది. భారత్ తరహాలోనే మేము కూడా ఈ మ్యాచ్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నామని శాంట్నర్ వెల్లడించాడు.
ఇరు జట్లు:
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్
#TeamIndia Captain @ShubmanGill wins the toss and elects to bowl in the 1st ODI. A look at our Playing XI for the game. Live - https://t.co/iZN2Y53Nur #NZvIND https://t.co/WfTOan6EiP
— BCCI (@BCCI) November 4, 2026
