సెప్టెంబరు నెలలో రూ.19 వేల కోట్ల.. ఇన్ఫ్రా ప్రాజెక్టులు బ్రిక్వర్క్ రిపోర్ట్ వెల్లడి

సెప్టెంబరు నెలలో రూ.19 వేల కోట్ల.. ఇన్ఫ్రా ప్రాజెక్టులు బ్రిక్వర్క్ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపడుడుతోంది. బ్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ రేటింగ్స్ రిపోర్ట్​ ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా రూ.19,184 కోట్ల విలువైన ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా రూ.13,757 కోట్ల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, రూ.5,427 కోట్ల విలువైన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీసీ స్లర్రీ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్రాజెక్టు ఉన్నాయి. 

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా 83 ప్రాజెక్టులు పట్టాలెక్కగా, అందులో రైల్వే శాఖకు చెందినవే 57 ఉండటం విశేషం. జులైలో రూ.7,402 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఆగస్టులో రూ.3,237 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రోడ్డు రవాణా, టెలికం, పెట్రోలియం, విద్యుత్ రంగాలు ఇందులో ముందున్నాయి. 

దేశవ్యాప్తంగా 1,853 ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుండగా, వీటి కోసం ఇప్పటివరకు రూ.17.73 లక్షల కోట్లు ఖర్చు చేశారు. భౌతికంగా 35 శాతం ప్రాజెక్టులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయని రేటింగ్స్ సంస్థ తెలిపింది.