దోహా: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో ఇండియా షూటర్ల గురి అదిరింది. మెన్స్ 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో రవీందర్ సింగ్, సౌరభ్ చౌదరి, అమన్‌ప్రీత్ సింగ్‌తో కూడిన ఇండియా త్రయం గోల్డ్ మెడల్ సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఇండియా త్రయం 1659 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. చైనా (1648), కొరియా వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను గెలుచుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో రవీందర్ సింగ్ 559 పాయింట్లతో సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు.
విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇండియాకు సిల్వర్ లభించింది. ఎలావెనిల్ వాలరివర్, సోనమ్ ఉత్తమ్ మస్కార్, శాంభవి శ్రవణ్ క్షీరసాగర్‌తో కూడిన ఇండియా త్రయం ఫైనల్లో 1894.4 పాయింట్లు సాధించి రెండో ప్లేస్‌లో నిలిచింది. చైనా (1899.8), జపాన్ (1892.6) వరుసగా గోల్డ్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో ఎలావెనిల్ 634.2 పాయింట్లతో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో ఇండియా ఒక స్వర్ణం, రెండు సిల్వర్ మెడల్స్‌తో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
