ఏసీబీకి చిక్కిన ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్..సదాశివపేట మండల వ్యవసాయ కార్యాలయంలో ఘటన

ఏసీబీకి చిక్కిన ఏవో  అగ్రికల్చర్ ఆఫీసర్..సదాశివపేట మండల వ్యవసాయ కార్యాలయంలో ఘటన

సదాశివపేట, వెలుగు: లంచం తీసుకుంటూ అగ్రికల్చర్​ ఆఫీసర్​ ఏసీబీ అధికారులకు రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ ఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఓ ఫర్టిలైజర్​ షాపు లైసెన్స్​ డాక్యుమెంట్ల మంజూరుకు ఏవో రమేశ్​రూ.30 డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ముందుగా రూ.10 వేలు చెల్లించి, గత నెల 19న ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. 

పక్కాప్లాన్​తో రంగంలోకి దిగిన ఏసీబీ ఆఫీసర్లు మార్క్​ చేసిన కరెన్సీ నోట్లను బాధితుడికి అందించారు. మిగిలిన రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రమేశ్​ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఏసీబీ ఆఫీస్​కు తరలించారు.