ఈనెల 7 నుంచి పంటలకు ‘కడెం’ నీళ్లు బంద్..మిషన్ భగీరథ కోసమే ఉన్న నీటి వినియోగం

ఈనెల 7 నుంచి పంటలకు ‘కడెం’ నీళ్లు బంద్..మిషన్ భగీరథ కోసమే ఉన్న నీటి వినియోగం

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటిని పంటల సాగు కోసం ఈనెల 7 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు చేసిన ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 3.495 టీఎంసీలకు గాను ప్రస్తుతం 2.195 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉండడంతో అధికారులు ఉన్న నీటినంత మిషన్ భగీరథ కింద రాబోయే వేసవి వరకు తాగినీటి కోసమే వినియోగించాలని నిర్ణయించారు. 

కాగా,  కడెం ప్రాజెక్టు నీటి పైనే ఆధారపడి ఖరీఫ్ పంటలను సాగు చేస్తున్న దస్తురాబాద్, దేవు నిగూడెం, రాంపూర్, భూత్కూర్ గ్రామాల రైతులు తీ వ్ర మనోవేదనకు లోనవుతున్నారు. పంటలకు భారీగా నష్టం వాటిల్లుతుందని, నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి డిసెంబర్ మొదటి వారం వరకు నీటిని అందించి పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.