రవీంద్రభారతి, వెలుగు: కళాకారుల సంక్షేమం, భవిష్యత్తుకు భద్రత కల్పించేలా ప్రభుత్వం కల్చరల్ పాలసీ తీసుకురావాలని ప్రముఖ మెజీషియన్ సామల వేణు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ సంస్మరణ సభను మిమిక్రీ ఆర్టిస్ట్ టాలెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా, సామల వేణు గౌరవ అతిథిగా హాజరై నివాళులర్పించారు.
