కీసర, వెలుగు: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం సాధించడమే లక్ష్యంగా మంగళవారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నాగారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారం కోసం 108 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతిపాదించారు.
పార్టీలు, సంఘాలు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని చర్చించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సీపీఐ మాస్ లైన్ గడ్డం సదానందం, సీపీఎం లీడర్ పి సత్యం, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేశ్ గౌడ్, జేఏసీ చైర్మన్ శంకర్ నాయక్పాల్గొన్నారు.
