సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పీడీఏతో.. బీజేపీలో భయాందోళన

సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పీడీఏతో.. బీజేపీలో భయాందోళన

ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అఖిలేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ విజయంతో రాజకీయ ముఖ చిత్రం మారుతున్నట్లు కనిపిస్తున్నది.  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో గెలిచింది. కానీ ఆరు స్థానాలలో  గెలుపొందిన బీజేపీ మాత్రం ఓటమిపాలైనట్లు ఆందోళన చెందుతోంది.

కాషాయ పార్టీ మనోబలాన్ని పెంచేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా  రెండు, మూడు నెలల్లో రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 350 సీట్లను  గెలుస్తామనే నినాదాన్ని తీసుకువచ్చారు. దానికి తోడుగా యూనిఫాం సివిల్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రస్తావించడం తమ హిందూ, ముస్లిం విభజన రాజకీయాలను మళ్లీ ముందుకు తీసుకువస్తున్నట్లు కనిపిస్తున్నది. యూపీలోని పౌర సమాజం మాత్రం బీజేపీ  పతనానికి కారణాలను వెతుకుతూ చర్చిస్తోంది.  

ఒకవైపు ఓటుచోరీపై  రాహుల్ గాంధీ 
నాయకత్వంలో ఇండియా కూటమి ఉద్యమిస్తుంటే,  మరోవైపు  జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ ఉద్యమం నిర్వహిస్తున్న అభిజిత్ దీప్కే కేంద్ర విద్యామంత్రిని రాజీనామా చేయించడంలో సఫలమై,  ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్  రాజీనామా ఉద్యమానికి సీజేపీ తోడవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతోపాటు అయోధ్య రామునిగుడి దోపిడీలో బీజేపీ,- ఆర్ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  ప్రధాన దోషులుగా చేస్తూ  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీపార్టీ ఉద్యమిస్తోంది. దురదృష్టవశాత్తు బీజేపీ నాయకులు గుడిదొంగలను రక్షిస్తున్నట్టుగా  కనిపిస్తున్నది.  ఈ ఉద్యమాల ప్రభావంతో బీజేపీ నరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కోల్పోయి తమ పార్టీ రక్షణలో పడిపోయింది.

బీజేపీలో ఉత్సాహం, పోరాటపటిమ క్షీణించినట్లు ప్రజలు గుర్తించడం మొదలయింది.  ప్రధానమంత్రి మోదీపై  విశ్వసనీయత  కోల్పోతున్నట్లు కనపడుతున్నది.  ముఖ్యంగా  వారణాసిలోని  గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలకు  చెందిన  రెండు స్థానాలలో  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ విజయం సాధించడంతో  బీజేపీ నాయకులకు నిద్ర కరువైంది. 

ఆధ్యాత్మిక కాశీలో బీజేపీ ఓటమి
సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన కాశీలోనే  బీజేపీ ఓడిపోవడం వారి పతనానికి ఆరంభంలాగా ప్రజలు చూస్తున్నారు. దానికి తోడు ఆగ్రా, మధుర స్థానాన్ని కూడా సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ  కైవసం చేసుకుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీకృష్ణుని జన్మస్థానమైన మధురలో బీజేపీ ఓడిపోవడం వారికి అంతుచిక్కడం లేదు. అదేవిధంగా దేశ రక్షణమంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గంలోని లక్నోలో  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం  బీజేపీ భయాందోళనలను విస్తృత పరుస్తున్నది.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ కార్యక్షేత్రమైన గోరఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,800 ఓట్లను ఎన్నికల అధికారి తిరస్కరించినా,  అతి స్వల్ప మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బయటపడడం వారి రాజకీయ క్షీణతను  తెలియజేస్తోంది. వారణాసిలో  ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మూడు రోజులు కొనసాగించినా... కుర్మి సమాజానికి చెందిన  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ ఎమ్మెల్సీ అభ్యర్థి అత్యధిక మెజారిటీ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  గెలవడం బీజేపీనీ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గురిచేసింది.

అయోధ్యలో ఎస్పీ గెలుపు
గత  లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలలో అయోధ్య జనరల్ స్థానంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ అభ్యర్థి  అవదేశ్ ప్రసాద్  గెలవడం బీజేపీ నాయకులకు తీవ్ర అవమానంగా మారింది.  బీజేపీ తమ పూర్తి రాజకీయాలు రామమందిరం చుట్టూ నడిపినప్పటికీ, వేల కోట్ల రూపాయలతో  రాజకీయ ప్రచారాలు చేసినప్పటికీ అయోధ్యలో బీజేపీ అస్తిత్వాన్ని కాపాడుకో లేకుండా పోయింది.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల క్షేత్రమైన బంకీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఓడిపోవడం దేనికి సంకేతం?   ఆర్ఎస్ఎస్ రాజధాని, మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఫడ్నవిస్, అదే విధంగా బీజేపీ  ప్రథమ వరుసలో కనిపించే  కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీల రాజకీయ క్షేత్రమైన నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి  గెలవడం బీజేపీ, -ఆర్ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మనువాద సిద్ధాంతానికి బీటలు పారుతున్నట్లుగా కనిపిస్తున్నది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో  ఎక్కువ సభ్యులు  గెలిచినా.. బీజేపీ  గెలుపుకన్నా క్షీణతను సూచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో వారి రాజకీయాలు భారతజాతి నిర్మాణానికి ఉపయోగకరంగా లేనివిగా ప్రజలు గుర్తించడం ప్రారంభమైనది.  భారత ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సమాజం బీజేపీ పాలనలో కనిపించకుండా పోతున్నది. కుల,- మత విద్వేషాలను పెంపొందించే రాజకీయాలు ఇక చెల్లవని విద్యావంతులు పాల్గొన్న ఎమ్మెల్సీ ఫలితాలు తెలియజేస్తున్నాయి. 

10 శాతం వ్యక్తులలో 70% సంపద
10శాతం వ్యక్తులలో 70% సంపద  పోగైనట్లు థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పికెట్టి  పరిశోధన  నివేదిక తెలుపుతోంది.  కింది వర్గాలకు చెందిన 50 శాతం జనాభా చేతిలో మూడు శాతం సంపద మాత్రమే ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఈ పరిణామాలు మేధావులను, సామాజిక ఉద్యమకారులను, అభ్యుదయ ప్రజాస్వామ్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

పలు కుల రుగ్మతలతో, అగ్ర,  నిమ్నవర్గాలుగా విభజనకుగురై  ముక్కలు, ముక్కలుగా చెల్లాచెదరైన సమాజానికి బీజేపీ  కార్పొరేట్ రాజకీయాలు తోడవడంతో సామాజిక అంతరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీజేపీ లక్ష్యమైన సవర్ణ  ధనికస్వామ్యానికి భారత సమాజం ఆటవిడుపుగా మారింది. అందుకేనేమో బీజేపీవారికి పేదలు కనపడరు. మహిళలు, దళితులు కనపడరు.

ముస్లింలు, క్రిస్టియన్లు, వెనుకబడిన వర్గాలు కూడా కనపడరు.  వారి ఓట్లను తొలగించడమే పరిష్కారంగా బీజేపీ బలపరుస్తున్న ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ 13కోట్లకు పైగా ఓట్లను తొలగించి ధనిక- సవర్ణస్వామ్యానికి దారి వేస్తున్నట్లుగా మన ముందున్న రాజకీయ చిత్రపటం స్పష్టం చేస్తోంది.  భారతదేశ సమస్యకు అసలు కారణం బ్రాహ్మణీయ కుల వ్యవస్థనే. 

అందుకే  పీడీఏ సమాజం మేల్కొని  ఐక్యంగా  ప్రజాస్వామ్య రక్షణ ఉద్యమంలో  పాల్గొంటున్నది.  ఇది రాజ్యాంగ జాతి నిర్మాణానికి తోడ్పడుతుంది. ఈ బాధ్యత  ఎస్సీ, ఆదివాసి, బీసీ, మైనారిటీ, స్త్రీల, అభ్యుదయవాదుల సమాజంపైనే ఎక్కువగా ఉన్నది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఏకి ఆదరణ
జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ ఉద్యమం ప్రశ్నిస్తున్న హిందూ, ముస్లిం విభజన రాజకీయాలకు ముగింపుగా ఎన్నికల తీర్పు సమాధానం చెబుతోంది.  యువతరం, విద్యావంతులు, దేశ ప్రజలు కోరుకుంటున్న శాంతియుత సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తున్నట్లు  ఈనాటి  రాజకీయాలు  కనిపిస్తున్నాయి.  ఎన్నికల సంఘం ద్వారా ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేసేలా బీజేపీ రాజకీయాలను మార్చే ప్రక్రియలో ఉన్నట్లు కనిపిస్తున్నది.

అందుకే  బహుశా రాజ్యాంగ రక్షణ, పీడీఏ వర్గాల (పిచ్‌డే, దళిత్‌, అల్పసంఖ్యక్‌) అభ్యున్నతిని, రాజ్యాంగ అధికారాన్ని ప్రచారం చేస్తున్న  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అభ్యుదయ ప్రజాస్వామ్యం ఎజెండాతో ముందుకు వస్తున్న  అఖిలేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తున్నది.  మనువాది  కుల, వర్ణ రాజకీయాలు కాదు,  సామాజిక న్యాయ రాజ్యస్థాపనే మేలుగా  సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీలు  పీడీఏతో  ముందుకుపోతున్నారు.

స్వాతంత్ర్యం అనంతరం రాజ్యాంగం,  ప్రజాస్వామ్యం కేంద్రంగా నడిచిన భారతీయ సమాజం బీజేపీ పాలనను  జీర్ణించుకో లేకుండా నిరసిస్తున్న దశగా మనం చూడాలి.  ప్రపంచీకరణ పేరుతో పోగైన సంపద కొద్దిమంది చేతులలోనే బందీ అయింది.  ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్రవేత్త థామస్ పికెట్టి పరిశోధన  ఒక్క శాతం జనాభా 40% సంపదను  సొంతం చేసుకున్నట్లు  తెలియజేస్తోంది.

ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాది పార్టీ, తెలంగాణ

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ [email protected]

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.

* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.