ప్రైవేటు బడుల అటెండెన్స్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెట్టాల్సిందే..మేనేజ్మెంట్లకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశం 

ప్రైవేటు బడుల అటెండెన్స్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పెట్టాల్సిందే..మేనేజ్మెంట్లకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న టీచర్ల హాజరు వివరాలను ఎప్పటికప్పుడు ఐఎస్‌‌‌‌ఎంఎస్ పోర్టల్‌‌‌‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తరచూ ప్రైవేట్ స్కూళ్ల హాజరు వివరాలను కోరుతున్న నేపథ్యంలో, ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించింది.

ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి పెండింగ్‌‌‌‌లో ఉన్న స్టూడెంట్లు, టీచర్ల హాజరు వివరాలను సంబంధిత స్కూల్ హెచ్‌‌‌‌ఎంలు వెంటనే పోర్టల్‌‌‌‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి మునుపటి నెలకు సంబంధించిన హాజరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు, ఎస్‌‌‌‌ఏ1 పరీక్షల ప్రోగ్రెస్ కార్డులను వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం తీసుకొచ్చామన్నారు.