అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మిశ్రమ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భారత్‌లో బుధవారం (నవంబర్ 4, 2026) బంగారం, వెండి ధరలు కాస్త ఒత్తిడికి లోనవుతున్నాయి.
ముడి చమురు ధరలు
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. అమెరికా WTI క్రూడ్ ఆయిల్ ధర 1 శాతం పడిపోయి బ్యారెల్‌కు సుమారు 95.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర కూడా స్వల్పంగా తగ్గి బ్యారెల్‌కు 103 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
సంవత్సరాంతానికి ఇజ్రాయెల్‌కు అందిస్తున్న 4 బిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత చమురు ధరలు గతంలో సాధించిన లాభాలను కోల్పోయాయి.
ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై రాత్రి జరిగిన దాడుల వల్ల చమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ తెలిపారు.
వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్ అంచనాలు
చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత పెంచాల్సిన అవసరం తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, డిసెంబర్‌లో జరిగే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం 75 శాతంగా ఉందని మార్కెట్ అంచనా వేస్తోంది.
బంగారం కొనుగోళ్లపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా
మరోవైపు, ఈ ఏడాది బంగారంలో పెట్టుబడులు పెరిగే అంచనాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తగ్గించింది. గతంలో 400 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసిన పెట్టుబడుల వృద్ధిని తాజాగా 200 మెట్రిక్ టన్నులకు తగ్గించింది. అయితే, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.
భారత్ లో బుధవారం (నవంబర్ 4, 2026) బంగారం ధరలు చుస్తే:
1 గ్రాము 24క్యారెట్ల బంగారం ధర రూ.27 పెరిగి 13,991, 22క్యారెట్ల ధర రూ.25 పెరిగి రూ. 12,825, 18క్యారెట్ల ధర రూ.20 పెరిగి రూ.10,493కి చేరాయి.
ఇక 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి 1,39,910, 22క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ. 1,28,250, 18క్యారెట్ల ధర రూ.200 పెరిగి రూ.1,04,930కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు చూస్తే
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 24క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి 1,39,910, 22క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ. 1,28,250, 18క్యారెట్ల ధర రూ.200 పెరిగి రూ.1,04,930కి చేరింది.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, 24క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి 1,39,910, 22క్యారెట్ల ధర రూ.250 పెరిగి రూ. 1,28,250, 18క్యారెట్ల ధర రూ.200 పెరిగి రూ.1,04,930కి చేరింది.
ఇక వెండి 1 గ్రాము ధర రూ.200 వద్ద ఉండగా కేజీ ధర రూ.2,00,000కి చేరింది.
