హైదరాబాద్, వెలుగు: లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు డిస్ట్రిక్ట్ , ఎయిర్‌టెల్ చేతులు కలిపాయి. బెంగళూరులో ఉన్న 16 ఎకరాల ఓపెన్ ఎయిర్ కన్సర్ట్ వేదిక పేరును 'ఎయిర్‌టెల్ ఎరీనా'గా మార్చాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ఎయిర్‌టెల్ తన 5జీ నెట్వర్క్ను అందిస్తుంది.
సుమారు 17 వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ వేదికలో ఫ్యాన్స్ లైవ్ స్ట్రీమింగ్, డిజిటల్ పేమెంట్స్ సులభంగా చేసుకునేందుకు సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో లైవ్ ఈవెంట్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
