న్యూఢిల్లీ:మనదేశంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద ఖర్చు చేస్తున్న మొత్తం నిధుల్లో సగానికి పైగా వాటా కేవలం టాప్ –200 కంపెనీల నుంచే వస్తోందని తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా వేలాది కంపెనీలు సామాజిక సేవా కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నప్పటికీ అధికం వాటా మాత్రం కార్పొరేట్ సంస్థల నుంచే ఉంది. చట్టం ప్రకారం లాభాల్లో 2 శాతం సామాజిక అభివృద్ధికి కేటాయించాలన్న నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత వీటి భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది.
ఈ నిధులను ప్రధానంగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి లాంటి రంగాలకు మళ్లిస్తున్నారు. ఆరోగ్య, విద్యా రంగాలకు అత్యధిక శాతం నిధులు చేరుతున్నాయి. నిధుల్లో అధికం శాతం మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు లాంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకే వెళుతున్నాయి.
బీహార్, జార్ఖండ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలకు చేరే నిధుల వాటా తక్కువగా ఉంటోంది. టాప్ ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్కంపెనీ ఏటా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.
