బజాజ్ అండతో అదరగొట్టిన ధినిధి 

బజాజ్ అండతో అదరగొట్టిన ధినిధి 

హైదరాబాద్​, వెలుగు: ఆర్థిక సేవల సంస్థ బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్ అందించిన ఆర్థిక అండతో బెంగళూరుకు చెందిన 16 ఏళ్ల యువ స్విమ్మర్ ధినిధి దేశింగు భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం రాసింది. దకార్ 2026 యూత్ ఒలింపిక్ క్రీడల్లో చారిత్రాత్మక పతకం గెలుచుకుంది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగిన ధినిధి 56.27 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం కైవసం చేసుకుంది. 

యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చరిత్ర సృష్టించింది. ఆర్థిక ఇబ్బందులు యువ క్రీడాకారుల ప్రతిభకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ధినిధికి పూర్తిస్థాయిలో అండగా నిలిచామని  బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వ్ సంస్థ తెలిపింది.  శిక్షణ, ప్రయాణ ఖర్చులను భరించామని పేర్కొంది.