అమెరికాలో మధ్యంతర ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 50 రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలంలో మిగిలిన రెండేండ్లు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఎవరి చేతిలో ఉండాలో తేల్చే ఈ ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్ పార్టీకి ఎదురుగాలి ఉందని స్పష్టం చేశాయి. పార్లమెంట్పై నియంత్రణ సాధించే ప్రయత్నంలో డెమోక్రాట్లు తొలి దశలోనే బలం పుంజుకున్నారు.
#USMidtermsOnWION: Democrats lead Republicans in both chambers, with a 43–33 advantage in the Senate and a 54–26 lead in the House #USElections2026 #USMidterms #Democrats #Republicans #USPolitics #ElectionUpdate Catch all the latest updates: https://t.co/41XvVLwJks https://t.co/Y2SDx3lxPw
— WION (@WIONews) November 4, 2026
రిజల్ట్స్ ఎర్లీ ట్రెండ్ చూస్తుంటే.. ట్రంప్కు బిగ్ షాక్ తప్పేలా లేదు. ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూసుకున్నట్లయితే.. డెమొక్రటిక్ పార్టీ సెనేట్లోని 45 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుండగా, రిపబ్లికన్ పార్టీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గవర్నర్ స్థానాల విషయానికొస్తే.. 15 స్థానాల్లో డెమొక్రాట్లు, 11 స్థానాల్లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యంలో ఉంది. హౌస్లోని సీట్ల విషయానికొస్తే.. 141 స్థానాల్లో డెమొక్రాట్లు, 151 స్థానాల్లో రిపబ్లికన్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నార్త్ కరోలినాలో కీలకమైన సెనేట్ స్థానాన్ని డెమోక్రాట్ రాయ్ కూపర్ కైవసం చేసుకున్నారు.
ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లోని మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లోని 100 సీట్లలో 35 సీట్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటితో పాటు 36 రాష్ట్రాల్లో గవర్నర్లను, రాష్ట్ర చట్టసభల సభ్యులను ఎన్నుకోవడానికి ఓటర్లు పోటెత్తారు.
ఏ సభలో ఎవరి బలం ఎంత ?
ప్రస్తుతం ప్రతినిధుల సభ, సెనేట్ రెండూ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆధీనంలోనే ఉన్నాయి. హౌస్‌లో మెజార్టీకి 218 సీట్లు కావాలి. ప్రస్తుతం అక్కడ రిపబ్లికన్లకు 218, డెమోక్రాట్లకు 214 సీట్లు ఉన్నాయి. సెనేట్‌లో రిపబ్లికన్లకు 53 సీట్లు ఉండగా, డెమోక్రాట్లకు 45, వారికి మద్దతిచ్చే ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.
ఎన్నికలు జరిగే 35 సెనేట్ సీట్లలో 22 రిపబ్లికన్లవి, 13 డెమోక్రాట్లవి. కాంగ్రెస్‌ను చేజిక్కించుకోవాలంటే డెమోక్రాట్లు హౌస్‌లో అదనంగా 3, సెనేట్‌లో 4 సీట్లు గెలవాలి. సెనేట్‌లో 50–50 టై అయితే ఉపాధ్యక్షుడు వాన్స్ ఓటుతో రిపబ్లికన్లకే పట్టు ఉంటుంది.
