జీవో168 సవరించాలి: తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్

జీవో168 సవరించాలి: తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్
  • ఎంఎంసీ ముందు రియల్టర్స్​ నిరసన

తార్నాక, వెలుగు: హైదరాబాద్ నగర పరిధిలో 168 జీవో అమలుతో పేద,మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రభుత్వం దూరం చేసే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ మండిపడ్డారు. ఆ జీవోను సవరించి రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి ప్లాటుకు భవన నిర్మాణ పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

18*50 సైజులో ఉన్న ప్లాట్లకు జీహెచ్ఎంసీ, ఎంఎంసీ పర్మిషన్ నిరాకరించడాన్ని నిరసిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తార్నాకలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదుట రియల్టర్స్ ధర్నా చేశారు.

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణం కోసం ఎంతో మంది పర్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే 168 జీవో ఉందని పర్మిషన్ రద్దు  చేస్తున్నారన్నారు. 18*50 సైజులో కొన్ని లక్షల ప్లాట్లు ఉన్నాయని, ఈ ప్లాట్లు కొన్న పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. 22 ఏ నిషేధిత భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. పగడాల రంగారావు, శ్రీకాంత్ రెడ్డి శ్రీశైలం పాల్గొన్నారు.