ప్రభుత్వ ధరలకే బియ్యం అమ్మకాలు..మంచిర్యాలలో ప్రైవేట్ అవుట్ లెట్ను ప్రారంభించిన కలెక్టర్

ప్రభుత్వ ధరలకే బియ్యం అమ్మకాలు..మంచిర్యాలలో ప్రైవేట్ అవుట్ లెట్ను ప్రారంభించిన కలెక్టర్

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు బియ్యం అమ్మకాలు సాగించాలని కలెక్టర్​కుమార్​దీపక్​ఆర్డర్స్​ జారీ చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులో ప్రభుత్వ ధరలకు బియ్యం విక్రయాలు జరిపేందుకు శ్రీనాథ్ ట్రేడర్స్ యాజమాన్యం కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్ లెట్​ను ఆయన ప్రారంభించారు. 

ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ఠ ధరలకు మించి అమ్మకాలు జరుపకూడదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్​హెచ్చరించారు. బీపీటీ, హెచ్​ఎంటీ తదితర రకాల బియ్యాన్ని ప్రభుత్వ ధరలకు అందించేందుకు గజానన్ ఇండస్ట్రీస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. 

ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్​లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని కోరారు. నిర్ణీత ధరలకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, సివిల్​ సప్లైస్​ అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

తనిఖీల కోసం వచ్చే అధికారులకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని సూచించారు. 26 కిలోల ప్రీమియం క్వాలిటీ బీపీటీ రా రైస్ బ్యాగ్​ను రూ.1430, హెచ్ఎంటీ స్టీమ్ రకం బియ్యం బస్తా రూ.1898 చొప్పున అవుట్ లెట్ ద్వారా విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వాటికి సంబంధించిన ధరల పట్టికను ప్రదర్శించారు. ఇన్​చార్జి డీసీఎస్​వో వేణుగోపాల్​ పాల్గొన్నారు.