జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలి: ఆర్ కృష్ణయ్య

జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలి: ఆర్ కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: జనగణనలో బీసీ గణన కోసం ప్రత్యేక కాలం పెట్టి, ప్రతి కులానికి యూనిక్ కోడ్ ఇచ్చేలా కేంద్రానికి సిఫారు చేయాలని జాతీయ బీసీ కమిషన్ కి ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని బీసీల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో బీసీ నేతలతో కలిసి ఎన్సీబీసీ చైర్ పర్సన్ సాద్వి జ్యోతి నిరంజన్ కు వినతిపత్రం సమర్పించారు. 

తొలిసారి జనగణనలో కులగణన చేపడుతోన్న కేంద్రం.. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీల కోసం ఒక ప్రత్యేక కాలం పెట్టాలన్నారు. తద్వారా దేశ వ్యాప్తంగా బీసీల స్పష్టమైన లెక్కలు తేలుతాయన్నారు. ఈ నిర్ణయంతో పలు రాజకీయా పార్టీలు, కుల సంఘాలు లేవనెత్తిన అనుమానాలకు చెక్ పెట్టినట్లు అవుతుందన్నారు.