ఇక ఈ పదవిలో కొనసాగలేను..! రైలు ప్రమాదం తర్వాత స్పెయిన్ రవాణాశాఖ మంత్రి రాజీనామా..!

ఇక ఈ పదవిలో కొనసాగలేను..! రైలు ప్రమాదం తర్వాత స్పెయిన్ రవాణాశాఖ మంత్రి రాజీనామా..!

స్పెయిన్ లోని మాడ్రిడ్, టోలెడో సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 69 మంది మృతి చెందిన ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ స్పెయిన్ రవాణాశాఖ మంత్రి ఆస్కార్ పుయెంటె రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ( నవంబర్ 3 )  ఈ ప్రమాదాన్ని ఉద్దేశించి పార్లమెంట్ లో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పుయెంటె. స్పెయిన్ లాంటి దేశంలో ఏడాది లోపే ఇంతటి తీవ్రతతో రెండు ప్రమాదాలు జరిగిన తర్వాత రవాణా మంత్రి పదవిలో కొనసాగలేనని అన్నారు పుయెంటె.

ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పుయెంటె. ఈ ఏడాది దేశంలో జరిగిన రెండవ ప్రధాన రైలు ప్రమాదానికి పుయెంటె బాధ్యత వహించారు.  ఈ ప్రమాదం జరిగిన వెంటనే తాను పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆ నిర్ణయాన్ని గోప్యంగా ఉంచానని పుయెంటె చెప్పారు. ఈ దుర్ఘటన అనంతరం ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, రైల్వే కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి పెరగడంతో రాజీనామా చేశారు పుయెంటె.

స్పెయిన్ లోని మాడ్రిడ్-సెవిల్ మార్గంలో జరిగిన రెండవ ప్రధాన రైలు ప్రమాదం ఇది. జనవరిలో, అడముజ్ సమీపంలో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొని 46 మంది మరణించారు.  రైల్వే భద్రతను మెరుగుపరిచేందుకు పుయెంటె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో నియంత్రణ కేంద్రాలలో పరిస్థితులను మెరుగుపరచడం, అలాగే రైల్వే సిగ్నలింగ్ మరియు భద్రతను మెరుగుపరచడానికి రూపొందించిన ప్రామాణిక సాంకేతికత అయిన యూరోపియన్ రైల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలును వేగవంతం చేయడం వంటివి ఉన్నాయి.