ల్యాండ్ అవుతూ గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు..ఒక భారతీయుడు మృతి.. నేపాల్ లో ఘటన

ల్యాండ్ అవుతూ గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు..ఒక భారతీయుడు మృతి.. నేపాల్ లో ఘటన

కాఠ్మాండూ: నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ల్యాండ్ అవుతున్న 2 హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చెన్నైకి చెందిన  వసంత్ కుమార్ బలరామరామడుగా గుర్తించారు. సోలుఖుంబు ప్రాంతంలోని ఫెరిచె హెలిప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఈ ఘటన జరిగింది. అత్యంత సమీపం నుంచి 2 హెలికాప్టర్లు ఢీకొనడం చూసిన హెలీప్యాడ్ వద్ద ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2 హెలికాప్టర్లు ల్యాండ్ అవుతున్న సమయంలో వాటి రెక్కలు(రోటర్లు) ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. 

దీంతో అవి అదుపుతప్పి కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఫిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెయిల్ ఎయిర్ హెలికాప్టర్​లో ప్రయాణిస్తున్న భారతీయుడు మృతిచెందారు. అందులోనే ప్రయాణించిన భారత సంతతికి చెందిన న్యూజీలాండ్ వాసి శైలేష్ ​క్రిష్ణ పటేల్, ఎయిర్​డైనాస్టీ సంస్థకు చెందిన పైలట్ గాయపడ్డారు. దీంతో వారిని కాఠ్మాండూ తరలించి చికిత్స అందిస్తున్నారు. నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యాటకులు,  పర్వతారోహకులు, అత్యవసర సామాగ్రిని తరలించడానికి చిన్న హెలికాప్టర్లను ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇక్కడి కఠినమైన భౌగోళిక పరిస్థితులు, వేగంగా మారుతున్న వాతావరణం విమానయానాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఇలాంటి పవాళ్లతో కూడుకున్న వాతావరణం కారణంగానే ఇటీవల ఉత్తరాఖండ్​లోని చమోలీ వద్ద హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.