నేడు (నవంబర్ 04)ఎన్టీఆర్ స్టేడియంలో సదర్..హాజరుకానున్న సీఎం రేవంత్

 నేడు  (నవంబర్ 04)ఎన్టీఆర్ స్టేడియంలో సదర్..హాజరుకానున్న సీఎం రేవంత్
  •     ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

​ముషీరాబాద్, వెలుగు: యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా సదర్ పండుగ నిలుస్తుందని శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ వ్యవస్థాపక చైర్మన్, మాజీ ఎంపీ అంజన్‌‌కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం ఇందిరా పార్కు వద్ద జరగనున్న శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో కర్ర పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సదర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​ యాదవ్​, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సదర్ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ నగరంలోని దేశీ మేలి జాతి దున్నారాజులు సదర్ సమ్మేళనంలో విన్యాసాలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ కుమార్ యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.