హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో క్వాలిజీల్ భారీ విస్తరణ.. కొత్తగా 600 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో క్వాలిజీల్ భారీ విస్తరణ.. కొత్తగా 600 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్​, వెలుగు: ట్రస్ట్-ఫస్ట్, ఏఐ- నేటివ్ క్వాలిటీ ఇంజినీరింగ్ సేవలు అందించే క్వాలిజీల్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ విస్తరణకు సన్నద్ధమైంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లపై (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తూ, 2028 నాటికి నగరంలో 600 మంది కొత్త నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏఐ, క్లౌడ్, డేటా ఇంజినీరింగ్, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అప్లికేషన్స్ విభాగాల్లో నియామకాలు చేపట్టనుంది. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే సంస్థకు 3 గ్లోబల్ డెలివరీ సెంటర్లు ఉన్నాయి. సుమారు 1,100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థ జీసీసీ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇండియా హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సునీల్ ఉపద్రష్టను నియమించింది.