సౌత్ ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్.. ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏడేళ్ల క్రితం ‘మిషన్ మంగళ్’ అనే హిందీ చిత్రంలో నటించిన నిత్యా.. ఈసారి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. వివేక్ ఒబెరాయ్ లీడ్‌గా రూపొందిన ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ చిత్రంలో ఆమె విలన్‌గా నటించింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుంచి మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
రెట్రో లుక్‌లో రూపొందించిన పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ఇద్దరి ముఖాలు సగం మాత్రమే కనిపించడం కథలోని సస్పెన్స్‌ను సూచిస్తోంది. నిత్యామీనన్ పాత్రలో ఉండే ఊహించని మలుపులు ప్రేక్షకులకు షాక్ ఇవ్వనున్నాయనే ఆసక్తి నెలకొంది. ప్రేమ, నమ్మకద్రోహం, మోసం వంటి అంశాల చుట్టూ కథ తిరగనుంది.
ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే ప్రమాదంగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వేవ్‌బ్యాండ్ ప్రొడక్షన్స్‌పై దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహించారు. శ్రేయా శర్మ, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
