హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ వివాదాలపై అందిన దరఖాస్తులను పరిశీలించకుండానే ఏఐ ఆధారంగా జనగా మ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించకుండా ఏఐ ఆధారంగా ఉత్తర్వులు ఇస్తే ప్రజల హక్కులకు తీవ్ర నష్టం కలిగే ప్రఈమాదం ఉందని పేర్కొంది.
జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమాడూరుకు చెందిన ఎం.కొమురయ్యభూమికి సంబంధించి కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. దీనిపై ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.
