- టీజీసీహెచ్ఈ చైర్మన్‌కు మాల జేఏసీ, స్టూడెంట్ జేఏసీల వినతి
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియాకాలను వెంటనే నిలిపివేయాలని మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్ జేఏసీ డిమాండ్ చేశాయి. ప్రస్తుతం అమలవుతున్న రోస్టర్ విధానంతో ఎస్సీ వర్గాల్లోని మెజారిటీ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఆ రోస్టర్‌ను సవరించిన తర్వాతే రిక్రూట్‌మెంట్లు చేపట్టాలని స్పష్టం చేశాయి.
ఈ మేరకు మంగళవారం జేఏసీ చైర్మన్లు మందాల భాస్కర్, మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రూప్-3లోని 26 కులాలు, గ్రూప్-1లోని15 కులాలు, గ్రూప్-2లోని 17 కులాలు మొత్తం 58 కులాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం, అసమానతలు ఎదురవుతున్నాయని ఆధారాలతో చైర్మన్‌కు వివరించినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి వెంటనే తీసుకెళ్లాలని కోరారు.
