తిరువనంతపురం: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన కేరళలోని శ్రీకార్యంలో కలకలం రేపింది. మృతుడిని అభిరామ్(17)గా గుర్తించారు. ఈ నెల1న స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బయటికెళ్లిన అభిరామ్ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో అంతా షాకయ్యారు.
ఓ యువతితో అభిరామ్‌కు పరిచయం ఉండగా, ఆమె మాజీ ప్రియుడు(17) అతడిపై కక్ష పెంచుకున్నాడు.యువతి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుంచి మెసేజ్ చేసి అభిరామ్‌ను పాంగప్పారకు రప్పించాడు. అక్కడ ఉన్న మాజీ ప్రియుడిని చూసిన అభిరామ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా రాయితో దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఉమర్ (22) సాయంతో మృతదేహాన్ని సంచిలో కుక్కి, ఆకులతో కప్పి డ్రెయిన్ దగ్గర పడేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన టీనేజర్‌తో పాటు ఉమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
