ములుగు/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ భూ యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. రైతులు సర్వేకు సహకరించాలని గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, సర్వే ఏడీ సుదర్శన్ కోరారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు భూముల రీసర్వేపైన అవగాహన కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దులను చూపెడతామని చెప్పారు.
