పల్టీ కొట్టిన కారు.. భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు..కంది మండల కేంద్రం వద్ద ఘటన

పల్టీ కొట్టిన కారు.. భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు..కంది మండల కేంద్రం వద్ద ఘటన

మెదక్/ సంగారెడ్డి, వెలుగు: కారు అదుపుతప్పి పల్టీ కొట్టగా అందులో ఉన్న భార్యభర్తలు స్పాట్​లో మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన బీజేపీ లీడర్​ యెల్లకొండ నర్సింహులు (40) సోమవారం హైదరాబాద్​లో జరిగిన మీటింగ్​కి హాజరై ఇంటికి వచ్చాడు. రాత్రి 10.30 సమయంలో భార్య మౌనిక(33)తో కలిసి కారులో సంగారెడ్డి వైపు బయలుదేరారు. 

ఈ క్రమంలో కంది మండల కేంద్రం వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్​ను ఢీకొని, పల్టీలు కొట్టి బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ స్పాట్​లోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్​ ఎస్సై మధుసూదన్​రెడ్డి తెలిపారు.