ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫినిక్స్ గేమింగ్ ఫోన్.. జీటీ 50 ప్రో 

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫినిక్స్ గేమింగ్ ఫోన్.. జీటీ 50 ప్రో 

గేమింగ్ ప్రియుల కోసం ఇన్​ఫినిక్స్​ సరికొత్త జీటీ 50 ప్రో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది.  లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఫోన్ కన్సోల్ స్థాయి గేమింగ్ అనుభూతిని ఇస్తుంది. ధర రూ.65 వేల నుంచి మొదలవుతుంది.  మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్, 1.5 కే అమోలెడ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, 144 హెజ్​ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

కంట్రోలర్, స్టేషన్ డాక్, కూలర్ వంటి యాక్సెసరీలను కూడా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫినిక్స్ అందుబాటులోకి తెచ్చింది. డాల్బీ ఆట్మోస్ సౌండ్ సిస్టమ్, జియో గేమ్స్ వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయని ఇన్ఫినిక్స్​ తెలిపింది.