పోలీసులు ప్రభుత్వానికి సేవ చేయాలి రాజకీయ పార్టీలకు కాదు : మద్రాస్ హైకోర్టు

పోలీసులు ప్రభుత్వానికి సేవ చేయాలి రాజకీయ పార్టీలకు కాదు : మద్రాస్ హైకోర్టు
  • మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడు రాజకీయాలు, పోలీసుల పనితీరుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి వివక్ష చూపకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. పోలీసులు ప్రభుత్వానికి సేవ చేయాలే తప్ప రాజకీయ పార్టీలకు కాదని పేర్కొంది.సీఎం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే కౌన్సిలర్ సుధకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రమేశ్​ మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

అక్టోబర్ 7న చెన్నైలో జరిగిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో సుధ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించిన హైకోర్టు.. ఈ కేసులో గరిష్ట శిక్ష మూడేళ్లు మాత్రమేనని, 60 ఏళ్ల వయసున్న సుధపై ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని పేర్కొంది. సాక్ష్యాధారాలు అందుబాటులో ఉన్నందున కస్టడీ విచారణ అవసరం లేదని తెలిపింది. 

మరిన్ని వార్తలు