ఏపీలో ఈ మూడు మండలాల్లో తప్ప యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

ఏపీలో ఈ మూడు మండలాల్లో తప్ప యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలను ‘మురసు తుఫాన్’ ముంచెత్తడంతో నవంబర్ 5న జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. కాకుమాను, ఫిరంగిపురం, పెదనందిపాడు మండలాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ మూడు మండలాల్లో తప్ప ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే.. నవంబర్ 5నే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 7న ఫలితాలను వెల్లడిస్తారు. ఏపీలోని మొత్తం 9 వేల 829 ఎంపీటీసీ స్థానాలకు 46 వేల 045 నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు 4 వేల 770 నామినేషన్లు దాఖలయ్యాయి.