తుఫాన్ దెబ్బకు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ : 2 గంటల్లో ఉచిత దర్శనం

తుఫాన్ దెబ్బకు తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ : 2 గంటల్లో ఉచిత దర్శనం

ఏపీలో వరుస తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ణబ్ తుఫాను సృష్టించిన విధ్వంసం మరువక ముందే మురుసు తుఫాను రాష్ట్రాన్ని వణికిస్తోంది. మురుసు తుఫాను ఎఫెక్ట్ కలియుగ వైకుంఠం తిరుమలపై కూడా పడింది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. తుఫాను కారణంగా చాలా మంది భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులకు రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని తెలిపారు అధికారులు.

ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలతో సహా ఏపీ, తెలంగాణ, తమిళనాడులో  తుఫాన్ ప్రభావంతో రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు రద్దు కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎంతోమంది భక్తులు తమ తిరుమల పర్యటనలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు.

గత బ్రహ్మోత్సవాల సమయం నుంచి తిరుమలలో కొనసాగిన భక్తుల రద్దీ ప్రస్తుతం కాస్త తగ్గింది. సాధారణంగా భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.తుఫాను పట్ల అప్రమత్తమయ్యారు టీటీడీ అధికారులు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్ల నిర్వహణపై దృష్టి సారించారు అధికారులు.