APPSC గ్రూప్ 1 కేసులో కీలక పరిణామం.. ఏడు చోట్ల ఈడీ సోదాలు..

APPSC గ్రూప్ 1 కేసులో కీలక పరిణామం.. ఏడు చోట్ల ఈడీ సోదాలు..

APPSC గ్రూప్ 1 కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు బుధవారం ( నవంబర్ 4 ) ఏకకాలంలో ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు ఈడీ అధికారులు. హైదరాబాద్ లో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఒక చోట తనిఖీలు చేపట్టారు అధికారులు. 2018లో విడుదలైన నోటిఫికేషన్ కు గాను 2020లో మెయిన్స్ పరీక్షలు జరగగా..ఇందుకు సంబంధించి అర్హత లేని 66 మందితో  కరెక్షన్ చేయించారన్న ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టింది ఈడీ.

ఈ కేసుకు సంబంధించి APPSC మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసం సహా హైదరాబాద్ లోని క్యామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో, సంస్థ ఎండీ మధుసూదన్ రావు నివాసంలో, ఆల్వాల్ వెంకటాపురంలో మహంకాళి రఘురాం ఇంట్లో, సికింద్రాబాద్ డిఫెన్స్ కాలనీలోని ట్రూగ్రేడర్ సర్వీసెస్ ఆఫీసులో,నెరేడ్ మెట్ అక్కెల్లపెరి శ్రీనివాసరావు ఇళ్లలో సోదాలు చేపట్టారు అధికారులు.

ALSO READ : 2 లక్షల 50 వేల మెజారిటీ..విశాఖ మేయర్ గా ముక్కా శ్రావణి గ్రాండ్ విక్టరీ

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని చినకాకానిలో ఉన్న ఆవాస రిసార్ట్ లో కూడా ఈడీ సోదాలు చేపట్టారు అధికారులు. ఈ వ్యవహారానికి సంబంధించి 2025లో విజయవాడ సూర్యారావుపేట పోలివే స్టేషన్ లో కేసు నమోదు కాగా.. సిట్ విచారణ చేపట్టి ఆధారాలు సేకరించారు అధికారులు. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఉండటంతో రంగంలోకి దిగిన ఈడీ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.