మాపై యుద్ధాన్ని అమెరికా వాళ్లే ఛీ కొట్టారు : ట్రంప్ ఓటమిపై ఇరాన్ చురకలు

మాపై యుద్ధాన్ని అమెరికా వాళ్లే ఛీ కొట్టారు : ట్రంప్ ఓటమిపై ఇరాన్ చురకలు

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా ఓడిపోవటంపై.. ప్రపంచంలోనే అత్యంత హ్యాపీగా ఉన్న దేశం ఏదో తెలుసా ఇరాన్.. అవును.. ట్రంప్ పార్టీ ఓటమి తర్వాత ఇరాన్ దేశం స్పందించింది. 

ఇరాన్ పై యుద్ధం వద్దని.. ఇరాన్ పై యుద్ధాన్ని అమెరికా ప్రజలు కోరుకోవటం లేదని తమ ఓట్ల ద్వారా ట్రంప్ కు చెప్పారు.. మాపై యుద్ధాన్ని అమెరికా వాళ్లే ఛీ కొట్టారు అంటూ ఇరాన్ సోషల్ మీడియాలో ఈ కామెంట్లను పోస్ట్ చేసింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ విజయం సాధించిన తర్వాత.. అమెరికా ఓటర్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారనే స్పష్టమైన సందేశం ఇచ్చారంటూ అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషించిన ఇరాన్ ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బఘేర్ అన్నారు. 

ఇరాన్ దేశంపై యుద్ధం తర్వాత అమెరికా ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగిందని.. అమెరికాలో ధరలు బాగా పెరిగాయని.. ఆ అసంతృప్తి ఈ మధ్యంతర ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది అంటూ వెల్లడించారు మొహమ్మద్ బఘేర్. ధరల పెరుగుదలలో అయినా.. సొంత మనస్సాక్షితో అయినా.. యుద్ధం వద్దు అని అమెరికన్లు ఓటు ద్వారా చెప్పారని.. అమెరికా ప్రజల తీర్పును గౌరవిస్తు్న్నామని.. ఇప్పటికైనా ఇరాన్ పై యుద్ధాన్ని ఆపాలంటూ పిలుపునిచ్చారాయన. 

అమెరికా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా.. మొండి వైఖరితో ట్రంప్ ముందుకు వెళితే.. అమెరికా చరిత్రలో అది ఒక పీడకలగా మారుతుందని.. రాబోయే రోజుల్లో అమెరికా ప్రజల జీవన వ్యయం ఇంకా పెరుగుతుందని హెచ్చరించారాయన. ఇరాన్ పై యుద్ధంతోపాటు ప్రపంచంలోనే ఇతర దేశాలపై సుంకాలు విధిస్తూ.. ఆయా దేశాలను అల్లకల్లోలం చేస్తున్న ట్రంప్ విధానాలు తప్పని.. మధ్యంతర ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలంటూ చురకలు అంటించారు ఇరాన్ చర్చల ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బఘేర్.

ఇరాన్ దేశంతో యుద్ధం కొనసాగింపు అనేది ప్రాంతీయ ఉద్రిక్తతలతోపాటు ప్రపంచంపై ఆర్థిక భారాలను తీసుకొస్తుందని.. ఆయిల్ మార్కెట్లు కుప్పకూలుతాయని.. ఇంధన కొరతతో దేశాలు అల్లాడిపోతాయని.. ఇప్పటికైనా ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేయాలంటూ సూచించారాయన.