దీపావళి పండుగ: వెరైటీ స్వీట్స్.. ఇంట్లోనే తయారీ.. కమ్మగా ఉంటాయి..!

దీపావళి పండుగ: వెరైటీ స్వీట్స్.. ఇంట్లోనే తయారీ.. కమ్మగా ఉంటాయి..!


 

 

 

 

దీపావళి అంటేనే ప్రత్యేకమైన పండుగ. నోరూరించే స్వీట్లు, మిరుమిట్లుగొలిపే దీపాల వెలుగులు. హోరెత్తించే క్రాకర్స్... ఇలా ఎంతో హడావిడి ఉండే సంబురం దీపావళి. ఈ పండుగలో అన్నింటికంటే స్వీట్స్ కాస్త ఎక్కువ స్పెషల్. బయటినుంచి తెచ్చుకునే స్వీట్స్ కంటే... ఇంట్లో చేసుకుంటే అవి ఇంకింత బాగుంటాయి.తియ్యటి స్వీట్స్ , మనసారా ఇచ్చే పర్సనల్ టచ్ స్పెషలే కదా మరి! బి స్వీట్స్ రెసిపీస్ మీ కోసం...!

క్రాకర్స్ స్వీట్స్ తయారీకి కావాల్సినవి

  • డార్క్ బ్రౌన్ చాక్లెట్ ముక్కలు-ఒక కప్పు
  • లైట్ బ్రౌన్ చాక్లెట్ ముక్కలు- ఒక కప్పు 
  • బటర్ స్మాచ్ పొడి (ఫ్రీవర్ కోసం)- ఒక టీ స్పూన్ 
  • సిలికాన్ చాక్లెట్ మౌల్డ్ (కాకర్స్​ షేప్ లో ఉన్నది) - కొన్ని
  •  గోల్డెన్ ఫాయిల్ పేవర్స్- కొన్ని
  •  క్రాకర్స్ స్టిక్కర్స్– కొన్ని

క్రాకర్స్ స్వీట్స్ తయారీ విధానం

 రెండు రకాల చాక్లెట్ ను వేరు వేరు గిన్నెల్లో తీసుకుని వాటిని కరిగించాలి. కరిగించిన చాక్లెట్స్ రెండింటినీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ సిరీస్​ లో  మీకు నచ్చిన ఫ్లేవర్ కలుపుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కావాలనుకున్నా వేసుకోవచ్చు ఈ చాక్లెట్ మెర్టెడ్ సిరప్ క్రాకర్స్ సిలికాన్ చాక్లెట్ మాల్స్ లో వేయాలి. ఈ మాల్స్ ను పావుగంట డీప్ ఫ్రిజ్​ లో  పెట్టి బయటకు తీయాలి. బయటకు తీశాక వాటిని గోల్డెన్ ఫాయిల్ పేపర్లో చుట్టాలి. వీటి పై క్రాకర్స్ స్టిక్కర్స్ అంటిస్తే మమ్మీ క్రాకర్స్ స్వీట్స్ తినేందుకు సిద్ధంగా ఉంటాయి.

బేసన్ బర్ఫీ తయారీకి కావలసినవి

  • శనగపిండి- 2000 గ్రాములు 
  • నెయ్యి- 200 గ్రాములు
  • వచ్చి కోవా- 200 గ్రాములు
  • చక్కెర - 200 గ్రాములు
  • ఇలాచీ–2 టీస్పూన్లు
  • పిస్తా–-10
  •  బాదం - 3
  •  జీడిపప్పు - 5

బేసన్ బర్ఫీ తయారీ విధానం

చక్కెర, ఇలాచి మిక్సీ జార్లో చేసి గ్రైండ్ చేయాలి. బాదం, జీడిపప్పు, పిస్తాలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పాన్​ సచ్చికోవా వేసి రెండు, మూడు నిమిషాలు వేగించి ఒక గిన్నెలోకి తీయాలి అదేపాన్​ లో  కాస్త నెయ్యి వేసి కరిగించాలి.

 నెయ్యి కరిగాక శెనగపిండి వేసి సన్నని మంట మీద వేగించాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తుండాలి. చివర్లో ఎక్కువ నెయ్యి వేసి శనగపిండి మంచి వాసన వచ్చేంతవరకూ వేగించాలి. తరువాత ఆ పిండిలో కొన్ని నీళ్లు చల్లి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.

శెనగపిండి దగ్గరవ్వగానే డ్రై ఫ్రూట్స్​ వేసి స్టవ్​  ఆపేయాలి. ఇది గోరువెచ్చగా ఉండగానే చక్కెర పొడి వేసి బాగా కలపాలి. బర్ఫీని నెయ్యి రాసిన గిన్నెలో వేసి బాగా వైండ్ చేసి, మిగిలి ఉన్న డ్రై ఫ్రూట్ ముక్కలను కూడా చల్లి ఇష్టమైన షేప్స్​ లో  కట్ చేయాలి.  అంతే బేసన్​ బర్ఫీ వెరైటీ స్వీట్​ రడీ,,

మలాయ్ లడ్డు తయారీకి కావాల్సినవి

  • మైదాపిండి- అరకేజీ
  • నెయ్యి - 200 గ్రాములు
  •  చక్కెర పొడి- అర కేజీ
  •  జీడిపప్పు - 100 గ్రాములు
  • హార్లిక్స్-100గ్రాములు 
  • ఇలాచి పొడి - రెండు టేబల్ స్పూన్లు
  • పిస్తా పప్పు - ఒక టేబుల్ స్పూన్ 
  • బాదంపప్పు- ఒక టేబుల్ స్పూన్

మలాయ్ లడ్డు తయారీ విధానం

పాన్​ లో  నెయ్యి వేడిచేసి మైదాపిండిని వేసి, సన్నని  మంటపై ఐదు నిమిషాలు వేగించాలి. వేగించిన మైదాపిండిని ఒక గిన్నెలోకి తీసి చల్లార్చాలి. మైదా పూర్తిగా చల్లారాక అందులో చక్కర పొడి హార్లిక్స్ వేసి కలపాలి. ఆ తరువాత జీడిపప్పు బాదంలను కూడా వేసి కలపాలి. అరచేతులకు నెయ్యి రాసుకుని కొంచెంకొంచెంగా పిండి తీసుకుని లడ్డూల్లా చుడితే  మలాయ్ లడ్డూ రెడి.

ప్రమిదల చాక్లెట్స్ తయారీకి కావాల్సినవి

  • చక్కెర పొడి- ఒక కప్పు
  •  కోకో పౌడర్- అర కప్పు
  • ఇన్​స్టంట్ కాఫీ పొడి- అరటీస్పూన్ 
  • మిల్క్ పౌడర్ పాపు కప్పు
  •  ప్రమిదల షేపులో ఉన్న సిలికాన్ చాక్లెట్ మౌల్ట్స్​ –2

ప్రమిదల చాక్లెట్స్ తయారీ విధానం 

 చక్కర పొడిలో కోకో పౌడర్, మిల్క్ పౌడర్ వేసి కలపాలి. తరువాత పిండిని జల్లెడతో జల్లించాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో సగానికి నీళ్లు పోసి స్టవ్ పై పెట్టాలి. రెండు నిమిషాల తరువాత దానిపై ఒక గాజు గిన్నె పెట్టాలి. 

గాజు గిన్నెలో కరిగించిన వెన్న వేయాలి. ఆ వెన్నలో  చాక్లెట్ పొడి వేసి విస్కర్​ తో  నెమ్మదిగా కలపాలి. ఓ మాదిరి మంట మీద పెట్టి చాక్లెట్ మిశ్రమాన్నికలుపుతూనే ఉండాలి. చక్కెర కరిగేంత
వరకూ బాగా కలపాలి. 20 నుంచి 70 నిమిషాల వరకూ కలుపుతూనే ఉండాలి. ఆ తరువాత స్టవ్ పై నుంచి గాజు గిన్నెను దించి అందులో వెనిల్లా ఎసెన్స్ కలపాలి.

 చాక్లెట్ సిరలా తయారైన ఈ మిశ్రమాన్ని ప్రమిదల ఆకారంలో ఉండే సిలికాన్ చాక్లెట్ మౌల్ లో కొంచెం కొంచెంగా వేయాలి. డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కావాలనుకుంటే చాక్లెట్ మౌల్ట్స్​లో చాక్లెట్ సిరప్ సగం చేసుకున్నాక అందులో డ్రై ఫ్రూట్స్​ ముక్కలు వేయొచ్చు. ఆ తరువాత మిగిలిన సిరప్ ను కూడా వేసి రెండు గంటలు ఫ్రిజ్​లో పెట్టి తీస్తే టేస్టీ టేస్ట్ ప్రమీదల చాక్లెట్స్ రెడీ..