4 ఏళ్ల జీతాన్ని దీపావళి బోనస్ గా ఇస్తున్నారా : మైక్రాన్ ఐటీ కంపెనీ వార్తల్లో నిజమెంత..?

4 ఏళ్ల జీతాన్ని దీపావళి బోనస్ గా ఇస్తున్నారా : మైక్రాన్ ఐటీ కంపెనీ వార్తల్లో నిజమెంత..?

అతని జీతం నెలకు 50 వేల రూపాయలు.. పని చేసేది ఐటీ కంపెనీలో అనుకోండి.. ఆ కంపెనీ దీపావళి బోనస్ ఇవ్వాలి అనుకుంటే ఎంత ఇస్తుంది.. రెండు, మూడు నెలల జీతం లేదా ఓ ఐఫోన్.. లేదా ఐదు, 10 లక్షల కారు ఇస్తుంది.. అవును కదా.. ఇప్పటి వరకు అలాగే చూశాం.. విన్నాం. ఇప్పుడు మాత్రం ఓ ఐటీ కంపెనీ.. తన ఉద్యోగులకు దీపావళి బోనస్ కింద ఏకంగా 4 సంవత్సరాల జీతం ఇచ్చింది.. అంటే 50 వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగి.. ఏకంగా 25 లక్షల రూపాయల బోనస్ అందుకోనున్నాడు.. ఇంత బోనస్ ఇస్తున్న ఐటీ కంపెనీ ఏంటీ.. ఈ బోనస్ నిజమేనా.. ఇండియాలోనా లేకపోతే విదేశాల్లోనా.. అసలు ఇది నిజమా కాదా అనేది పూర్తి తెలుసుకుందామా...

మైక్రాన్ కంపెనీ ఇండియాలోని తమ ఉద్యోగులకు 3 నుంచి 4 ఏళ్ళ జీతాన్ని బోనస్ గా ఇస్తోందని రెడిట్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రేంజ్ బోనస్ ఇస్తున్నారన్న వార్తలు నిజమేనని... తమ కంపెనీ భారీగా క్యాష్, స్టాక్ అవార్డ్స్ ఇస్తోందంటూ టెకీ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మైక్రాన్ కంపెనీలో కొత్తాగా జాయిన్ అయిన తన ఫ్రెండ్ కి రూ.6.5 లక్షల బోనస్ వచ్చిందని..అక్టోబర్ నెల జీతంతో పాటు బోనస్ కూడా ఒకేసారి క్రెడిట్ అయ్యిందంటూ చెప్పుకొచ్చారు ఓ నెటిజన్. 

మైక్రాన్ ఉద్యోగికి రూ.20 లక్షలు నగదు, స్టాక్స్:

ఇటీవల రూ.7 నుంచి 8 లక్షల ప్యాకేజితో మైక్రాన్ లో చేరిన ఓ టెకీకి సుమారు రూ.12 లక్షల క్యాష్ తో పాటు రూ.8 లక్షల విలువైన రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ అందినట్లు మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

తనకు తెలిసిన ఓ మైక్రాన్ ఉద్యోగి ఇప్పుడు తన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. అయితే..మైక్రాన్ లో దీపావళి బోనస్ గురించి కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది కానీ... అధికారికంగా కంపెనీ నుంచి ఎలాంటి క్లారిటీ ఇంకా రాలేదు.