ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌ ట్రైన్లో భారీ చోరీ.. రూ. 2.5 లక్షల నగలు మాయం, గుక్కపెట్టి ఏడ్చిన మహిళ

ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌ ట్రైన్లో భారీ చోరీ.. రూ. 2.5 లక్షల నగలు మాయం, గుక్కపెట్టి ఏడ్చిన మహిళ

Train Theft: రైల్వేల్లో అత్యంత సేఫ్ అని భావించే ఫస్ట్ ఏసీ (1st AC Coupe) బోగీల్లోనూ ప్రయాణికులకు రక్షణ లేకుండా పోయింది. లక్నో రైల్వే స్టేషన్‌లో ఆనంద్ విహార్ టెర్మినల్ న్యూ జల్ పాయిగురి ఎక్స్‌ప్రెస్ (ట్రెయిన్ నంబర్: 15726)లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు తన చిన్నారితో కలిసి ప్రయాణిస్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లాక్ చేసి ఉన్న ఫస్ట్ ఏసీ కూపేలోకి గుర్తు తెలియని దొంగలు చొరబడి రూ. 2.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 25,000 నగదును దోచుకెళ్లారు.

ట్రైన్లో చోరీ.. కన్నీరుపెట్టుకున్న ప్రయాణికురాలు:

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో జెమ్స్ ఆఫ్ రైల్వేస్ (Gems of Railways) ఖాతా ద్వారా వైరల్‌గా మారింది. బాధితురాలు ఏడుస్తూ రైల్వే భద్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్నాను, లక్నో స్టేషన్‌లో నా నగలు, డబ్బు మొత్తం దొంగిలించబడ్డాయి.. రూ. 2.5 లక్షల నగలు, రూ. 25 వేల క్యాష్ పోయాయి.. దేవుడి దయ వల్ల నా పాపను ఎత్తుకెళ్లకుండా బతికిపోయాను, కానీ లాక్ చేసిన ఫస్ట్ ఏసీ కేబిన్ కూడా ఇప్పుడు సురక్షితం కాకుండా పోయింది.. అసలు ఫస్ట్ ఏసీలోనే భద్రత లేకపోతే మేం ఎక్కడ ప్రయాణించాలి? అని ప్రశ్నించింది.  

నాలుగు సార్లు చైన్ లాగినా పట్టించుకోని ఆర్‌పీఎఫ్: 

రైలులో దొంగతనం జరిగిన వెంటనే సహాయం కోసం ఆమె నాలుగు సార్లు ఎమర్జెన్సీ చైన్ (Emergency Chain) లాగినట్లు తెలిపింది. చైన్ లాగినా కూడా ఒక్క రైల్వే పోలీస్ (RPF) కానీ, రైల్వే సిబ్బంది కానీ వచ్చి పలకరించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నేను అంతగా అరిచినా, చైన్ లాగినా ఒక్క అధికారి కూడా రాలేదు.. నేనిప్పుడు ఏం చేయాలి? అని ప్రశ్నించింది.

ALSO READ : 9 శాతం క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశ..రూ.1,211 కోట్లు టోకరా!..15 అంచెల రెఫరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ పే మోసం

రైల్వే శాఖ స్పందన: 

సోషల్ మీడియాలో ఈ వీడియో తీవ్ర దుమారం రేపడంతో నార్తర్న్ రైల్వే (Northern Railway - Lucknow Division) స్పందించింది. ఈ దొంగతనంపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) అధికారులను ఆదేశించింది. అత్యంత ఖరీదైన ఫస్ట్ ఏసీ బోగీలోనే ప్రయాణికురాలిపై దొంగతనం జరగడంపై మిగతా ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.