I'm Game OTT: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ థ్రిల్లర్.. దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ స్టోరీ ఇదే!

I'm Game OTT: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ థ్రిల్లర్.. దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ స్టోరీ ఇదే!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ (I'm Game Movie). ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబరు 3న థియేటర్లలో విడుదలై క్రేజీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘జియోహాట్‌ స్టార్‌’లో నవంబరు 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మళయాళంతో పాటుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆడియన్స్ను అలరించనుంది. 

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ 'డాన్ జాన్' అనే గ్యాంబ్లర్ పాత్రలో కనిపించారు. అదృష్టాన్ని నమ్ముకునే ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో ఆయన పెర్ఫార్మెన్స్, కరిష్మా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  కథలోని ఫాంటసీ ఎలిమెంట్ థియేటర్‌లో  మైండ్ బ్లాంక్ అయ్యే ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది. హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ మెస్మరైజ్ చేసింది. మొత్తానికి థియేటర్లలో సందడి చేసిన ‘ఐ యామ్ గేమ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో దుల్కర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి డిజిటల్ స్క్రీన్‌పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి!

కథేంటంటే:

ఈ సినిమా కథ అంతా 'డాన్ జాన్' (దుల్కర్ సల్మాన్) అనే ఒక రిస్క్ టేకింగ్, బిందాస్ యంగ్ మెన్ చుట్టూ తిరుగుతుంది. ప్రతి విషయంలోనూ లెక్కలేసుకుని, అదృష్టాన్ని నమ్ముకుని బతికే డాన్.. అనుకోకుండా ఒక భారీ బెట్టింగ్ సామ్రాజ్యంలో చిక్కుకుంటాడు. అక్కడ జరిగిన ఒక ప్రమాదం తర్వాత అతనికి హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుంది. అక్కడి నుంచే అసలు కథలోని ఫాంటసీ, ట్విస్ట్ మొదలవుతుంది. ఆ కొత్త చేతికి ఒక ఫ్లాష్‌బ్యాక్, అలాగే ఒక సొంత పగ ఉంటాయి. ఆ చెయ్యి ఇచ్చే సైకలాజికల్, ఫిజికల్ పవర్స్ వల్ల డాన్ ఓ మైటీ విలన్‌తో భారీ రివెంజ్ వార్‌లో దిగాల్సి వస్తుంది. అసలు ఆ చెయ్యి ఎవరిది? డాన్ ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే మిగతా కథ.