ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) దేశవ్యాప్తంగా వివిధ వర్క్ సెంటర్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 3,047 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 29న ప్రారంభం కాగా నవంబర్ 20 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: అప్రెంటిస్.
మొత్తం ఖాళీలు: 3047.
విభాగాల వారీగా ఖాళీలు: నార్త్ సెక్టార్ 191, ముంబయి సెక్టార్ 482, వెస్టర్న్ సెక్టార్ 1166, ఈస్టర్న్ సెక్టార్ 674, సౌతర్న్ సెక్టార్ 269, సెంట్రల్ సెక్టార్ 267.
విద్యార్హతలు
*లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
*ట్రేడు పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
*ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ పోస్టులకు బి.కాం ఉత్తీర్ణులై ఉండాలి.
*ల్యాబ్ కెమిస్ట్/ అనలిస్ట్– పెట్రోలియం ప్రొడక్ట్ పోస్టులకు కెమిస్ట్రీలో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
*ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్– ఆయిల్ & గ్యాస్ పోస్టులకు బీబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
*స్టోర్ కీపర్ (పెట్రోలియం ప్రొడక్ట్), సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్ - ఆయిల్ & గ్యాస్ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
*కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఇనుస్ట్రుమెంటేషన్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
*అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
*కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ ఇనుస్ట్రుమెంటేషన్/ మెకానికల్ ఎగ్జిక్యూటివ్ (గ్రాడ్యుయేట్) పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
*పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఒక సబ్జెక్టుగా జియాలజీతో కూడిన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
*సివిల్ ఎగ్జిక్యూటివ్ (డిప్లొమా) పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2026, నవంబర్ 29 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్కూట్నీ, అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ongcindia.comను సందర్శించండి.
